ఐపీఎల్ : అందులో కూడా సురేష్ రైనా టాపే?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందుగా ప్రకటించిన విధంగానే మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. అయితే మునుపటి లా కాకుండా ఈసారి ఐపీఎల్  లో ఏకంగా 10 జట్లు టైటిల్ కోసం తల పడబోతున్నాయ్. ఇక ఈ పది జట్లు  కూడా రెండు గ్రూపులు గా విడిపోయి ఐపీఎల్ టైటిల్ కోసం పోరాడపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అన్ని జట్లు కూడా ఐపీఎల్ లో ఎలాంటి వ్యూహాలతో  బరిలోకి దిగాలి అన్నది ఫిక్స్ అయిపోయాయి.

 అదే సమయంలో ఐపీఎల్ లో కి కొత్త గా ఎంట్రీ ఇస్తున్న లక్నో గుజరాత్ జట్లు మొదటి సీజన్లో టైటిల్ గెలవాలని ఆతృతగా  ఎదురుచూస్తున్నాయ్. ఇక ఇలాంటి సమయంలోనే ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇక ఈ ఏడాది సీజన్ వరకు ఎవరు అద్భుతంగా రాణించారు ఎవరు ఎక్కువ క్యాచ్లు పట్టారు. ఎవరు ఎక్కువ పరుగులు చేశారు అన్నది మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇక ఐపీఎల్లో ఇప్పటివరకు ఎవరు ఎక్కువ క్యాచ్లు పట్టారూ అన్న విషయానికి వస్తే.. ఇటీవల ఐపీఎల్లో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి.


 ఒకసారి ఆ డీటెయిల్స్ చూసుకుంటే.. సురేష్ రైనా 205 మ్యాచ్ లలో 109 క్యాచ్ లు పట్టాడు. కిరణ్ పోలార్డ్ 178 మ్యాచ్లలో 96 క్యాచ్ లు పట్టాడు.. రోహిత్ శర్మ 184 మ్యాచ్లలో 90 క్యాచ్లు అందుకున్నాడు. ఎబి డివిలియర్స్ 213 మ్యాచ్లలో 90 క్యాచ్ లు అందుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 205 మ్యాచ్లలో ఏకంగా 84 క్యాచ్ లు అందుకున్నాడు. ధావన్ 192 మ్యాచ్లలో 82 క్యాచ్ లు అందుకున్నాడు. రవీంద్ర జడేజా రెండు వందల మ్యాచ్లు ఆడి 81 అందుకోవడం గమనార్హం    బ్రావో 151 మ్యాచ్లు ఆడి 77 క్యాచ్లు అందుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్ వీరుడు  ఇక ఇటీవలే మెగా వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన సీనియర్ ఆటగాడు సురేష్ రైనా టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: