వరల్డ్ కప్: చావో రేవో మ్యాచ్ లో ఇండియా ఎదురీత?
ఈ అవకాశం ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లకు ఉంది. కాగా నేడు కీలకమైన మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా తో తలపడింది. ఈ మ్యాచ్ లో గెలవడం ఇండియాకు చాలా అవసరం. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లు గెలిచి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీనితో ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. అందులో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఫామ్ లో ఉన్న స్మృతి విఫలం అయింది. అలాగే మళ్లీ అవకాశం దక్కిన షేఫాలి వర్మ మరో సారి ఇండియా యాజమాన్యాన్ని నిరాశ పరిచింది.
అయితే ఆ తర్వాత వికెట్ పడకుండా కెప్టెన్ మిథాలీ (68) మరియు యస్తిక భాటియా (59) లు అర్ధ సెంచరీలతో రాణించడంతో ఇండియా నిలబడగల్గింది. ఇక చివర్లో ఎప్పటిలాగే హర్మన్ ప్రీత్ కౌర్ వేగంగా ఆడి జట్టు స్కోర్ ను ౨౭౭ పరుగులకు చేర్చింది. ఈ క్రమంలో పూజ వస్త్రాకర్ విలువైన పరుగు చేసి ఇండియా కు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో సహాయపడింది. ఆస్ట్రేలియా ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఈ స్కోర్ ను సునాయాసంగా చేధించగలదు. ఇండియా కంగారూలను తన బౌలింగ్ తో కట్టడి చేస్తుందా అన్నది తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.