ఐపిఎల్ : తక్కువ బంతుల్లో అర్ధశతక వీరులు వీళ్ళే?
ఇక మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గత సీజన్లకు సంబంధించిన విషయాలు ఎప్పుడు వైరల్ గా మారిపోతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత వేగంగా అర్థ శతకం సాధించిన ఆటగాళ్లలో కె.ఎల్.రాహుల్ అందరికంటే ముందు స్థానంలో ఉన్నాడు. కేవలం 14 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగేళ్ల నుంచి ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు అని చెప్పాలి. 2018లో పంజాబ్ తరఫున ఆడిన కేఎల్ రాహుల్ ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.
ఇక అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. 2014లో కోల్కత్త తరపున ఆడిన యూసుఫ్ పఠాన్ సన్రైజర్స్ లో జరిగిన మరో పదిహేను బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్రౌండర్ సునీల్ నరైన్ సైతం అదరగొట్టాడు. ఇక అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఏకంగా 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 2017 లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అతను రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు.
మిస్టర్ ఐపీఎల్ గా పేరు సంపాదించుకున్న సురేష్ రైనా బాదుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించిన ఆటగాళ్లలో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఏకంగా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సురేష్ రైనా అటు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏకమొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న సురేష్ రైనా 87 పరుగులు చేశాడు.
ఇక యువ ఆటగాడు ఇషాన్ కిషన్ సైతం ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. 16 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి సురేష్ రైనా తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ మ్యాచ్ లో ముంబై జట్టు తరపున ఆడిన ఇషాన్ కిషన్ ఈ ఘనత సాధించాడు. 32 బంతుల్లో ఎదుర్కొని 84 పరుగులు చేశాడు. ఆ తర్వాత 17 బంతుల్లో శతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో 9 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో క్రిస్‌గేల్, హార్దిక్ పాండ్య, కీరణ్ పొలార్డ్, ఆడం గిల్‌క్రిస్ట్, క్రిస్‌మోరిస్, నికోలస్ పూరన్‌తో పాటు.. ఇషాన్, పొలార్డ్, నరైన్ రెండో సారి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇక 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వారిలో పృథ్వీ షా, రిషభ్ పంత్, జోస్ బట్లర్ ఉన్నారు.