పంజాబ్ కింగ్స్ ని అందుకే వదిలేశా : కెఎల్ రాహుల్
అయితే ఇలాంటి క్రమంలోనే దాదాపు నాలుగేళ్ల పాటు పంజాబ్ కింగ్స్ జట్టులో కెప్టెన్ గా కొనసాగిన కేఎల్ రాహుల్ ఇక జట్టు నుంచి తప్పుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పంజాబ్ కింగ్ లో ఒంటరి పోరాటం చేసి ఎన్నో ప్రశంసలు అందుకున్న కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే కాదు.. ఎందుకు జట్టు నుంచి తప్పుకున్నాడు అన్న దాని గురించి ఎంతో చర్చ జరిగింది. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు కేఎల్ రాహుల్. నాలుగేళ్లపాటు వారితో కలిసి ఉన్నాను. ఐపీఎల్లో ప్రయాణంలో నేను కొత్తగా ఏ నిరూపించగలనో చూడాలని భావించాను.
నిజానికి పంజాబ్ కింగ్స్ నుంచి తప్పుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనది నిజానికి నాకు పంజాబ్తో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. కొత్తగా ఏదైనా చేయాలనే తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ లో కొత్త గా ఎంట్రీ ఇస్తున్న లక్నో సూపర్ జెంట్ జట్టుకు రాహుల్ ను రీటైన్ చేసుకోక ఇక కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది. కాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ అభిమానులందరికీ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు అన్న విషయం తెలిసిందే?