యువకుడి చేతిలో చిత్తైన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్... ?
ఇందులో భాగంగా నిన్న ఆదివారం కాలిఫోర్నియా లో రఫెల్ నాదల్ మరియు టేలర్ ఫ్రిడ్జ్ ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఫేవరెట్ ఎవరు అంటే ఎవ్వరైనా తడుముకోకుండా రఫెల్ నాదల్ దే విజయం అని చెబుతారు. అయితే మ్యాచ్ మొదలైన కాసేపటికే విషయం అర్థమై పోయి ఉంటుంది. మ్యాచ్ ఆద్యంతం రఫెల్ నాదల్ ఏమంత కంఫర్ట్ గా కదలలేపోయాడు. ఈ అవకాశాన్ని వాడుకున్న టేలర్ తన శక్తిని అంతా కూడగట్టుకుని మొదటి సెట్ ను 6-3 తేడాతో సాధించాడు. ఇక సంచలనాలకు మారు పేరైన నాదల్ సెకండ్ సెట్ లో అయినా పుంజుకుంటాడని భావించినా కుదరలేదు.
అయితే సెకండ్ సెట్ టై బ్రేక్ వరకు వెళ్ళింది. ఈ టై బ్రేక్ లో పాయింట్ సాధించిన టేలర్ 7-6 తో రెండవ సెట్ ను మరియు మరియు మ్యాచ్ ను గెలుచుకుని ఇండియా వెల్స్ మాస్టర్ 1000 టైటిల్ ను మొదటిసారి గెలుచుకుని రికార్డు సాధించాడు. దీనితో నాదల్ తన కెరీర్ లో ౩౭ వ మాస్టర్ టైటిల్ ను కోల్పోయాడు.