వరల్డ్ కప్ : భారత్ సెమీస్ చేరాలంటే?
మొత్తంగా ఆడిన ఐదు మ్యాచ్ లలో కేవలం పాకిస్తాన్ వెస్టిండీస్ పై మాత్రమే విజయం సాధించిన టీమిండియా అటు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే ఇటీవలే డూ ఆర్ డై మ్యాచ్ ఆడింది టీమిండియా. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే భారీ పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గడ్డపై ఘన విజయం సాధించిన టీమిండియా ఇక వరల్డ్ కప్ లో పాయింట్ల పట్టికలో ఏకంగా మూడవ స్థానానికి చేరుకుంది.. ఇక ఇప్పటికీ కూడా టీమిండియా సెమీస్ చేరాలంటే మాత్రం ఇంకా సవాళ్ళను ఎదుర్కోవాల్సినా పరిస్థితి ఉంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీఫైనల్లో స్థానం సంపాదించుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఇక సౌత్ ఆఫ్రికా రెండో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇక మిగిలిన రెండు బెర్తుల కోసం ప్రస్తుతం ఇండియా వెస్టిండీస్ ఇంగ్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో మెరుగైన రన్రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతున్న టీమిండియాకు సెమీస్కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్లో సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన ఉంటుంది. అలా గెలిస్తే నేరుగా సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఇండియా ఓడితే వెస్టిండీస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లపై ఇక ఇండియా సెమీస్ వెళ్లడం అనేది ఆధారపడి ఉంటుంది..