వరల్డ్ కప్: కీలక పోరు... విండీస్ గెలిస్తే సెమీస్ ఛాన్స్?

VAMSI
గత 20 రోజులుగా నిర్విరామంగా జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ కీలక దశకు చేరుకుంది. పాయింట్ల పట్టికను బట్టి చూస్తే సెమీస్ కు చేరుతాయి అన్న జట్లు ఏవి అంటే? ముందుగా ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికాలు అని చెప్పాలి. ఈ రెండు జట్లు మాత్రం మిగిలిన ఏ జట్లతో సంబంధం లేకుండా వరుస మ్యాచ్ లలో గెలుస్తూ సెమీస్ లో బెర్త్ లను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆస్ట్రేలియా మాత్రం ఆడిన 6 మ్యాచ్ లలో గెలిచి మొదటి స్థానంలో ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా మాత్రం నిన్న ఆస్ట్రేలియా తో ఆడిన మ్యాచ్ లో ఓటమి పాలై రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన రెండు సెమీస్ స్థానాల కోసం మూడు జట్ల మధ్యన పోటీ ఉంటుంది .

ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ఇండియా, ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లకు ఛాన్స్ లు ఉన్నాయి. అయితే రేపు వెస్ట్ ఇండీస్ మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా వెస్ట్ ఇండీస్ గెలిస్తేనే సెమీస్ కు వెళుతుంది, ఒకవేళ ఓడితే మాత్రం ఇక ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే టోర్నీ ఆద్యంతం పేలవమైన ఆటతీరు కనబరిచిన న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లో అనధికారికంగా టోర్నీ నుండి దూరం అయ్యాయి .

కాబట్టి రేపు జరగబోయే వెస్ట్ ఇండీస్ మ్యాచ్ లో ఫలితాన్ని బట్టి సెమీస్ కు వెళ్లే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ రేపు విండీస్ ఓడినా ఇంగ్లాండ్ కనుక మిగిలిన రెండు మ్యాచ్ లలో ఓడితే అప్పుడు వెస్ట్ ఇండీస్ సెమీస్ చేరుతుంది. అసలు ఏమి జరగనుంది అనేది తెలియాలంటే రేపు ఉదయం వరకు వేచి చూడాల్సిందే  .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: