ధోని సలహాలు ఇవ్వొద్దు అని చెప్పాడు?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో 3 ఐసీసీ ట్రోఫిలు సాధించిన ఏకైక కెప్టెన్ కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతను సాధించిన రికార్డుల గురించి మాత్రం ఇప్పటికి అంతర్జాతీయ క్రికెట్ లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక అంతే కాదు తన కెప్టెన్సీలో అందరిని మంత్రముగ్దుల్ని చేస్తూ ఉండేవాడు మహేంద్రసింగ్ ధోని. ఎంత ఒత్తిడిలో అయినా సరే ఎంతో ప్రశాంతంగా ఉంటూ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తూ ఉండేవాడు.


 ఇక ధోనీ కెప్టెన్సీపై అటు మాజీ ఆటగాళ్లు ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో పూణే జట్టుకు సహాయక కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రసన్న అగోరన్ ధోని నాయకత్వ లక్షణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.  ధోని అంత గొప్ప నాయకుడిగా ఎలా ఎదిగాడో తన మొదటి సమావేశంలోనే తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు. ధోని తనకు స్వాగతం పలుకుతూనే ఒక కీలక సూచన చేశాడు అని గుర్తు చేసుకున్నాడు. తనకు తొలిసారి మహేంద్ర సింగ్ ధోనీ తో కలిసి పనిచేసే అవకాశం 2016 లో వచ్చింది.



 మొదటి రోజు నాకు స్వాగతం పలుకుతూనే మనం ఇద్దరం కాసేపు మాట్లాడుకుందాం అంటు ధోని ఆహ్వానించారు. ఇక ఆ తర్వాత కాఫీ తాగుతారా అని అడిగి మరీ తెప్పించారు. మీకు చాలా అనుభవం ఉంది.. అందుకే స్టీఫెన్ ఫ్లెమింగ్ మిమ్మల్ని  కోచ్ గా తీసుకున్నారు. ఇక మీ వద్ద ఉన్న సమాచారం స్ట్రాటజీ కి సంబంధించిన వివరాలను కోచ్ లతోపాటు ఆటగాళ్లు ఇవ్వండి. స్ట్రాటజీ  సమావేశాలకి ఆటగాళ్లు అందరూ వస్తారు.. కాని తాను వస్తానని మాత్రం ఆశించవద్దు. అంతేకాకుండా నేను అడిగే వరకు ఎలాంటి సలహాలు ఇవ్వకండి.. ప్రతి విషయాన్ని జి మెయిల్ రూపంలో ఆటగాళ్లతో కమ్యూనికేట్ చేయండి అంటూ ఇక ఆ సమయంలో ధోనీ చెప్పాడని ప్రసన్న గుర్తుచేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: