ఓటమి ఎంతగానో బాధిస్తోంది.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు?
పట్టువదలకుండా పోరాడినప్పటికీ కూడా భారత జట్టుకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతి వరకు అద్భుతమైన పోరాటం సాగించింది భారత మహిళల జట్టు. ముఖ్యంగా హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చివరికి వృధా అయిపోయింది. అయితే అటు వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినప్పటికి అటు టీమిండియా అద్వితీయమైన పోరాటం మాత్రం అభిమానులందరినీ కూడా మనసులు గెలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక ఓటమి తో నిరాశలో ఉన్న మిథాలీ సేన కు అందరూ అండగా నిలుస్తూ ఉన్నారు.
ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం భారత మహిళల జట్టు కు మద్దతుగా నిలిచాడు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు కానీ అలా జరగలేదు.. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించటం ఎంతగానో బాధిస్తోంది.. అయినప్పటికీ మీరు గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం అని అంటూ సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేసాడు విరాట్ కోహ్లీ. ఓటమిని తట్టుకోవడం కష్టమేనని అయితే గెలుపు కోసం చివరి వరకు పోరాడటం మాత్రం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల ఐపీఎల్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టుకు ఓటమి తప్పలేదు.