ఐపీఎల్ 2022: కె ఎల్ రాహుల్ చేసిన తప్పిదాలు ఇవే?

VAMSI
నిన్న ముంబై లోని వాంఖడే స్టేడియం లో ఐపిఎల్ సీజన్ 15 లోకి అడుగు పెట్టిన కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఇండియా స్టార్ ఆటగాడు కే ఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్న లక్నో జట్టు ఓటమిని చవి చూసింది. అయితే కే ఎల్ రాహుల్ ఒక బ్యాట్స్మన్ గా ప్రేక్షకుల్లో ఎంతో పేరుంది. కానీ కెప్టెన్సీ విషయంలో రాహుల్ కు కలిసి రావడం లేదు. అటు అంతర్జాతీయ స్థాయిలో మరియు స్థానిక ఐపిఎల్ లోనూ కెప్టెన్ గా ఫెయిల్యూర్ అయ్యాడు. తాజాగా నిన్న జరిగిన మ్యాచ్ లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.

ఈ మ్యాచ్ లో రాహుల్ చేసిన కొన్ని తప్పిదాల గురించి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గల 5 కారణాలు ఏమిటో? రాహుల్ చేసిన తప్పిదాలు ఏమిటో ఒకసారి చూద్దాం.  

బ్యాటింగ్ లో విఫలం

టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. కె ఎల్ రాహుల్ మరియు డి కాక్ లు ఓపెనర్ లుగా వచ్చారు. అయితే ఇన్నింగ్స్ మొదటి బంతికే షమీ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి డక్ ఔట్ అయ్యాడు. కొత్త ఫ్రాంచైజీ తో మొదటి మ్యాచ్ ఆడుతున్న ఒక కెప్టెన్ ఇలా మొదటి బంతికే ఔటవ్వడం విచారకరం.

బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు

లక్నో జట్టులో ఓపెనింగ్ చేసే ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు ఇద్దరు ఉన్నారు. అయినా రాహుల్ ఎందుకు ఓపెనింగ్ కు రావడం అర్ధం కాని ప్రశ్న. డికాక్ మరియు లూయిస్ లు ఇప్పటికే ఐపీఎల్ లో బెస్ట్ ఓపెనర్ లుగా ప్రూవ్ చేసుకున్నారు. అందుకు ఈ సీజన్ మొత్తానికి వీరిద్దరినే ఓపెనర్ లుగా ఆడించాలి. రాహుల్ జట్టు పరిస్థితిని బట్టి మిడిల్ ఆర్డర్ లేదా ఆఖరిలో దిగడం మంచిదని కొందరి క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే రాహుల్ హిట్టింగ్ లో సామర్ధ్యం కలిగిన వాడు. మరి ముందు మ్యాచ్ లలో అయినా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసుకోవాలి.

బౌలింగ్ లో మార్పులు

నిన్న మ్యాచ్ చూసిన ఎవరైనా లక్నో నే గెలుస్తుంది అని అనుకుని ఉంటారు. దీనికి కారణం 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఖరి 5 ఓవర్ లలో 70 పరుగులు చేయాల్సిన స్థితిలో మిల్లర్ మరియు తివాతియా విజృంభణతో సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. అయితే లక్నో బౌలింగ్ యూనిట్ పటిష్టంగానే ఉంది. శ్రీలంక బౌలర్ చమీరా మొదటి ఓవర్లలో రెండు వికెట్లు తీసాడు. అలాంటి బౌలర్ కి తన కోటాను కూడా పూర్తి చేయించలేదు రాహుల్. అంతే కాకుండా ఆఖరి నాలుగు ఓవర్లలో ఎవరైనా స్పిన్ బౌలింగ్ ఇస్తారా? కానీ మన రాహుల్ ఇచ్చాడు. బౌలింగ్ సరిగా పడని బిష్ణోయ్ కు ఇచ్చి భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

ఇలా పలు కీలక పొరపాట్లు లక్నో ను ఓడిపోయేలా చేశాయి. ఇక ముందు మ్యాచ్ లకు అయినా తమ గేమ్ ప్లాన్ మార్చుకోకుంటే ప్లే ఆప్స్ కు చేరుకోవడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: