ఇంట్లో కూర్చుని ఐపీఎల్ చూడటం.. చిరాకుగా ఉంది?
ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్లో ఆయా దేశాల జట్ల తరపున ఆడిన ఎంతో మంది ఆటగాళ్లు గాయాల బారినపడి ఐపీఎల్‌కు దూరం అయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఇలాంటివారిలో చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగిన శంకరం కూడా ఒకరు అన్న విషయం సామ్ కరణ్. కొన్ని సీజన్‌లా నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లో కేవలం బౌలింగ్ లో మాత్రమే కాదు బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతు జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు సామ్ కరణ్. కానీ గాయం కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ కి దూరం అయ్యాడు అన్న విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఐపీఎల్లో ఆడకపోవడం పై అసహనం వ్యక్తం చేశాడు సామ్ కరణ్. ఇంట్లో కూర్చుని ఐపీఎల్ చూడటం ఎంతో చిరాకుగా ఉందని చెప్పుకొచ్చాడు. తన జట్టు సభ్యులంతా గ్రౌండ్లో ఆడుతుంటే ఇంట్లో నేను కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటే ఎంతో చిరాకుగా కోపంగా అనిపిస్తుందని జట్టులో తాను కూడా ఉండి ఉంటే బాగుండేదని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు. అయితే శారీరకంగా రిస్కు తీసుకోవద్దు అనే ఉద్దేశంతోనే ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు సామ్ కరణ్. కాగా చెన్నై జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ ఇంగ్లాండ్ ఆటగాడు..