పాపం.. ఇషాంత్ శర్మ పరిస్థితి ఇలా అయ్యిందేంటి?
టీమిండియాలో అతనికి అవకాశాలు దక్కడం చాలా కష్టం గా మారిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ఇక ఇషాంత్ శర్మకు చివరిది అని చెప్పవచ్చు. ఆతర్వాత శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. ఇక ఇషాంత్ శర్మతో పాటు రహానే పుజారా సాహా లను కూడా ఎంపిక చేయలేదు. అయితే కొంత మంది ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇషాంత్ శర్మ కెరీర్ దాదాపు ముగిసినట్లే అని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఐపీఎల్ లో కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
ఈ క్రమంలోనే ఇషాంత్ శర్మ ఐపీఎల్లో కనిపించకుండా పోయాడు. దీంతో అభిమానులు నిరాశ పడుతున్న సమయంలో ఇషాంత్ శర్మ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. బెంగళూరు కోల్‌కతా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కనిపించాడు. అది ఆటగాడిగా కాదు కనీసం కామెంటేటర్‌గా కూడా కాదు వర్చువల్ గెస్ట్ బాక్స్ లో ఒక అభిమానిగా కనిపించాడు ఇషాంత్ శర్మ. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయా ఫ్రాంచైజీల అభిమానులు వర్చువల్ గెస్ట్ బాక్స్ లో పాల్గొంటూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇషాంత్ శర్మ గెస్ట్ బాక్సులో కనిపించాడు. ఇది చూసి ఒక టైంలో టీమ్ ఇండియాలో బెస్ట్ బౌలర్ గా ఉన్నాడు ఇప్పుడు మాత్రం వర్చువల్ గెస్ట్ బాక్స్ లో ఒక ప్రేక్షకుడిగా మారిపోయాడు. పాపం ఇషాంత్ శర్మ కి ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటున్నారు అభిమానులు. ఇప్పటివరకు 105 టెస్టుల్లో 311 వికెట్లు 80 వన్డేల్లో 114 వికెట్లు ఐపీఎల్ లో 93 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు పడగొట్టాడు ఇషాంత్ శర్మ..