అతన్ని ఎలా వాడుకోవాలో.. ధోనికి బాగా తెలుసు?

praveen
టీమిండియా దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ సామర్థ్యం గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఇక జట్టులో ఉన్న ఆటగాళ్ళని ధోని ఎప్పుడు ఎలా వినియోగించుకుంటాడు అనే విషయంపై అప్పుడప్పుడు మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఆసక్తికర విషయాలను చెబుతూ ఉంటారు. ఇక ఇటీవల ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ ధోని నాయకత్వం గురించి అతని వ్యూహాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ధోని బౌలర్లకు వినియోగించుకునే విధానం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.


 బౌలర్ల ని ఎప్పుడు ఎలా వాడుకోవాలి అని ధోని కి బాగా తెలుసు.. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ లాంటి టాలెంట్ స్పీన్నర్ ని సరైన సమయంలో ధోనీ వాడుకుంటాడు అంటూ పార్దివ్ పటేల్ చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి పిచ్ ను బట్టి బౌలర్ల ఎంపిక చేయడం జరుగుతుంది. చెన్నైలో అయితే 140 నుంచి 150 పరుగుల అయినా కూడా. మంచి లక్ష్యమే అని చెప్పాలి.పిచ్ మీద అశ్విన్ టాలెంట్ ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. 2010 సీజన్లో అశ్విని చేతికి కొత్త బంతిని ఇవ్వడం విశేషం. ఇక టీమిండియా తరపున కూడా ధోనీ సారథ్యంలో అశ్విన్ మంచి ప్రదర్శన కనబరిచాడు అంటూ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.


 ఇకపోతే వెటరన్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడూ వైవిధ్యమైన బంతూలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఇండియాలో వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇక ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి 2015వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాడు అశ్విన్. చెన్నై జట్టుపై నిషేధం ఏర్పడడంతో పూణే జట్టుకు ఆ తర్వాత పంజాబ్ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మెగా వేలంలో రాజస్థాన్ జట్టులోకి వెళ్ళిపోయాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక చెన్నైకి 97 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 90 వికెట్లు పడగొట్టి 6.46 ఏకానమితో కొనసాగాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: