శ్రేయస్ Vs మయాంక్.. పోటీ ఎలా ఉంటుందో?
ఈ క్రమంలోనే ఇక ప్రతీ మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. కాగా నేడు ఐపీఎల్ 2022 లో భాగంగా ఎనిమిదో మ్యాచ్ జరగబోతోంది. కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు జట్లకి కూడా ఇటీవలే మెగా వేలం కారణంగా కొత్త కెప్టెన్లు వచ్చేశారు. కోల్కతా నైట్రైడర్స్ జట్టు కి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా ఉండగా ఇక ఈ ఏడాది మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వచ్చాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కి ఇప్పటికే కెప్టెన్సీలో మంచి అనుభవం కూడా ఉంది. అదే సమయంలో ఇక కేఎల్ రాహుల్ కి బదులుగా పంజాబ్ కి మయాంక్ అగర్వాల్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు.
ఈ క్రమంలోనే ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్ళు తమ జట్టు గెలిపించేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా నేడు రాత్రి ఏడున్నర గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే తొలి మ్యాచ్ లో గెలిచిన పంజాబ్ జట్టు జోరు మీద ఉంది. ఇక మరో వైపు తొలి మ్యాచ్లో గెలిచి రెండో మ్యాచ్లో ఓడిపోయిన కోల్కతా జట్టు ఈసారి మాత్రం తప్పక గెలవాలన్న కసితో ఉంది. దీంతో ఇక ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారబోతుంది అని అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు..