నా కెప్టెన్ ను కలిసాను.. ఎంతో సంతోషం : గంభీర్

praveen
గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో చివరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై కొత్తగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా ఆరు వికెట్ల  తేడాతో విజయం సాధించి అరుదైన రికార్డును కూడా సాధించింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో పోటీపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో జట్లలో ఒకప్పుడు భారత క్రికెట్ కు ఆడిన గౌతం గంభీర్ మహేంద్ర సింగ్ ధోనీ లు ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మెంటార్ గా గౌతం గంభీర్ ఉండగా ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకొని చెన్నైలో ఒక సాదాసీదా ఆటగాడిగా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక మ్యాచ్ పూర్తయిన అనంతరం లక్నో మెంటర్ గౌతం గంభీర్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటో ని సోషల్ వీడియోలు పోస్ట్ చేసాడు గౌతం గంభీర్. చాలా రోజుల తర్వాత నా కెప్టెన్ ని కలిశాను ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఒక కామెంట్ కూడా జత చేశాడు గౌతం గంభీర్. ఇక ఈ ఫోటో చూసి అటు ఇద్దరు క్రికెటర్ల అభిమానులు కూడా ఎంతగానో మురిసిపోతున్నారు.


 ఇకపోతే మహేంద్ర సింగ్ ధోనీ గౌతం గంభీర్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. 2011 వన్డే ప్రపంచకప్లో ఇద్దరు బ్యాట్స్మెన్ చెలరేగి ఆడటంతో నే భారత జట్టుకు చారిత్రాత్మక విజయం లభించింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా కోల్కతా కెప్టెన్  గా గౌతమ్ గంభీర్ చెన్నై సారధిగా మహేంద్ర సింగ్ ధోనీ పలుమార్లు మైదానంలో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఇక ఐపీఎల్లో వీరి మధ్య వైరం స్నేహపూర్వకంగా సాగుతూ వచ్చింది. ఇక ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ క్రికెటర్లు కలుసుకోవడం ఇక ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడం చూసి అభిమానులు అందరూ మురిసిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: