డెత్ ఓవర్లలో అతను రాటు తేలాడు : రవి శాస్త్రి
డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ బౌలర్గా మారేందుకు హర్షల్ పటేల్ ప్రయత్నిస్తున్నాడు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. కోల్కతా నైట్రైడర్స్ జట్టు లో ప్రమాదకర బ్యాట్ మెన్స్ అయినా సామ్ బిల్డింగ్స్, ఆండ్రూ రస్సెల్ క్రీజులో ఉన్నప్పుడు కూడా హర్షల్ పటేల్ రెండు ఓవర్లు మెయిడిన్ వేయడం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. కోల్కతా జట్టు 128 పరుగులకే కుప్పకూలడంలో హసరంగా, ఆకాష్ దీప్ లతో పాటు అటు హర్షల్ పటేల్ కూడా ఎంతో కీలకపాత్ర వహించాడు అంటూ మాజీ కోచ్ రావిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
తాను భారత జట్టుకు కోచ్గా కొనసాగుతున్న సమయంలో హర్షల్ పటేల్ తో మాట్లాడాను. అతడికి తన బౌలింగ్ సత్తా ఏమిటో బాగా తెలుసు. అంతే కాదు అతని బౌలింగ్ పై ఎంతగానో నమ్మకం ఉంచుతాడు. ఇక అతని గురించి అతనికి ఎంత నమ్మకం ఉంటుందో ఆండ్రూ రస్సెల్ లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ క్రీజులో పెట్టుకొని మేడిన్ వేసి చూపించాడు హర్షల్ పటేల్. ఇక ఎవరికీ ఏ విధంగా బౌలింగ్ చేయాలి అని ముందుగానే బ్రెయిన్ లో ప్లాన్ చేసుకుంటూ ఉంటాడూ హర్షల్ పటేల్. ఇటీవలి కాలంలో బౌలింగ్ యాక్షన్ లో కూడా ఎంతగానో పరిణితి కనిపించింది. డెత్ ఓవర్లలో మరింత నాణ్యమైన బౌలింగ్ చేస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు రవిశాస్త్రి.