ఐపీఎల్ : అరుదైన రికార్డు సాధించిన తెలుగు కుర్రాడు?
ముఖ్యంగా ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఒకప్పుడు ఐపీఎల్లో బాగా రాణించిన వారే కావడం గమనార్హం. ఇకపోతే ఇటీవల ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్ సీజన్ లో మరోసారి ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. మేమే ఫ్యూచర్ స్టార్స్ అని తమ ఆటతీరుతో చెప్పకనే చెబుతున్నారు. ఇకపోతే ఇటీవల తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరఫున అవకాశం దక్కించుకున్నాడు. దీంతో అతను ఎలా ఆడతాడా అని అటు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూశారు. ఇటీవలే అదరగొట్టాడు తిలక్ వర్మ.
ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో చాంపియన్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలు అయింది. అయితే ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పటికీ ఒక యువ ఆటగాడు మాత్రం అందరి మనసులు గెలుచుకున్నాడు. ముప్పై మూడు బంతుల్లో మూడు ఫోర్లు 5 సిక్సర్లతో చెలరేగి 61 పరుగులు చేశాడు. అతను ఎవరో కాదు మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ. దీంతో అరుదైన రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత తక్కువ వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2018లో రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 19 ఏళ్ల 258 రోజుల్లో వయసులో ఈ ఫీట్ సాధించి అరుదైన రికార్డు ఖాతలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 19 ఏళ్ళ 145 రోజుల వయసులో రికార్డు సాధించాడు..