ఐపీఎల్ : పాయింట్ల పట్టిక తారుమారు అయ్యిందే?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 మొదలైంది అంటే చాలు ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఇక ప్రతి ప్రేక్షకుడిని  కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేస్తూ ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కూడా అటు ఏ జట్టు ఏ మేరకు ప్రదర్శన చేస్తుంది అన్నది ఒక అంచనా ఉంటుంది. అంతేకాదు పాయింట్ల పట్టికలో ఏ జట్టు కొనసాగుతుంది అన్నదానిపై ప్రేక్షకులందరూ క్లారిటీ ఉండేది. కానీ ఇక ఇప్పుడు మాత్రం ఆ క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి.  ఎందుకంటే గత సీజన్ వరకు పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉన్న జట్లు ఇక ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంటాయి.. ఇక గత సీజన్ వరకు పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగిన జట్లు ఇక అంతకంతకూ దిగజారిపోతు ఉండటం గమనార్హం.


 ఇక ఇలా పాయింట్ల పట్టికలో అనూహ్యమైన మార్పులు జరుగుతూ ఉండటం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా ప్రేక్షకులందరికీ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతూ ఉంటాయి చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ విజేత గా నిలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు కప్ గెలుచుకుంది. ఎక్కువసార్లు  ఫైనల్ ఆడిన జట్టుగా కూడా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఎప్పుడూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఈ రెండు జట్లు కూడా టాప్లో కొనసాగుతూ ఉంటాయి.


 అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్  రవీంద్ర జడేజా సారథ్యంలో బరిలోకి దిగగా..  ముంబై ఇండియన్స్ మాత్రం పాత కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోనే మ్యాచ్లు ఆడుతుంది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు టాప్ లో కొనసాగుతోంది.. వరుసగా రెండు మ్యాచ్లలో నెగ్గి మంచి రన్ రేట్ కూడా కలిగివుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అయితే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మాత్రం వరుసగా 8,9 స్థానాలలో ఉండటం గమనార్హం. ఇక ఒక మ్యాచ్లో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ చివరి  ప్లేస్ దక్కించుకుంది. ఇక రెండు మూడు స్థానాల్లో కోల్కత నైట్రైడర్స్ గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: