ఐపీఎల్ : నేడు అభిమానులకు నిరాశేనా?
ఎందుకంటే ఇక శని ఆదివారాల్లో ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పెంచేందుకు ఒకటి కాదు దాదాపు రెండు మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం మూడు గంటలకి ఒక మ్యాచ్ జరిగితే ఇక రాత్రి ఏడున్నర గంటలకు మరో మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. దీంతో ఇక శని ఆదివారాల్లో సెలవు దినం కావడంతో టీవీలకు అతుక్కుపోయి మరి అసలుసిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు ప్రేక్షకులు. కాగా నిన్న శనివారం కావడంతో రెండు మ్యాచ్లు జరిగాయి. మధ్యాహ్నం మూడు గంటలకి రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఇక సాయంత్రం ఏడున్నర గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రెండు మ్యాచ్లలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతోంది. అయితే ఇక నేడు ఆదివారం కావడంతో ఈ రోజు కూడా రెండు మ్యాచ్లు జరుగుతాయి అని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ప్రేక్షకులకు మాత్రం నిరాశ ఎదురైంది అని తెలుస్తోంది. ఎందుకంటే నేడు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ జరగబోతోంది. దీంతో ఇక ఐపీఎల్ అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోతున్నారు. ఆదివారం రోజు కూడా ఒక్క మ్యాచేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు..