షాకింగ్ : ఐపీఎల్ లో కరోనా కలకలం?
ఇక ఆ తర్వాత భారత్ లో ఐపీఎల్ నిర్వహించాలి అనుకున్నప్పటికీ కరోనా వైరస్ షాక్ ఇవ్వడంతో సగం ఐపీఎల్ యూఏఈలో జరిగింది. ఇప్పుడు కఠిన నిబంధనల మధ్య భారత వేదికగా ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లను సైతం ప్రత్యేకమైన బయో బబుల్ లోనే ఉంచుతూ మ్యాచులు నిర్వహిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి సమయంలో బిసిసిఐకి షాక్ ఇస్తూ ఇటీవలే ఐపీఎల్ లో మొదటి కరోనా కేసు నమోదయింది. బీసీసీఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ మాత్రం వదిలిపెట్టడం లేదు.
ఐపీఎల్ లో నమోదైన తొలి కరోనా కేసు ఆటగాళ్లలో కాదు. ఐపీఎల్లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఆటగాడు ఆకాష్ చొప్రా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియాకు వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిందని.. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న అంటు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ తెలిపారు. అయితే ప్రస్తుతం కామెంటేటర్లను కూడా బీసీసీఐ బయో బబుల్ ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఆకాష్ చొప్రా ఎలా వైరస్ బారిన పడ్డారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై బిసిసిఐ విచారణ జరిపే అవకాశం ఉంది..