మీ వల్ల కాకపోతే చెప్పండి నేనొస్తా.. సన్రైజర్స్ కి మంత్రి బంపర్ ఆఫర్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది. అయితే ఇక ఇంకా టోర్నీలో భాగంగా అన్ని జట్లు కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. గత సీజన్ వరకు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన జట్లు సైతం ఈ సారి మాత్రం అద్భుతంగా రాణిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతూ ఉన్నాయి.  మెగా వేలం కారణంగా కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావడంతో మొన్నటి సీజన్ వరకు పాయింట్ల పట్టిక లో చివరిలో ఉండే జట్లు ఇప్పుడు వరుస విజయాలతో కొనసాగుతూ ఉన్నాయి. ఇక అన్ని జట్లు ఆట తీరు మారిపోయింది కానీ అది సన్రైజర్స్ ఆ తీరులో మాత్రం మార్పు రాలేదు.


 జట్టులోకి కొత్త ఆటగాళ్లు రావడంతో ఇక సన్రైజర్స్ కూడా అద్భుతంగా రాణిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ సన్రైజర్స్ జట్టుకు ఏదీ కలిసిరావడంలేదు. 2021 సీజన్ చేదు జ్ఞాపకాలను మర్చిపోయేలా ఇక ఈ ఏడాది సీజన్ లో అదరగొట్టాలి అని భావించిన హైదరాబాద్ జట్టుకు వరుస పరాజయాల పలకరిస్తూ ఉండటం గమనార్హం. దీంతో అభిమానులు డీలా పడిపోతున్నారు. తొలి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైన సన్ రైజర్ ఆ తర్వాత లక్నో చేతిలో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది.


 ఇక ఈ నెల 17 వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కి ముందు మాజీ ప్లేయర్ మనోజ్ తివారి సన్రైజర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టీమిండియాలో మరో ధోని అంటూ వేగంగా అవకాశం దక్కించుకున్న మనోజ్ తివారి అంతే వేగంగా టీమిండియా కు దూరం అయ్యాడు. ఐపీఎల్ లో మాత్రం పర్వాలేదనిపించాడు. ఐపీఎల్ లో 98 మ్యాచ్లు ఆడిన మనోజ్ తివారీ 1695 పరుగులు చేశాడు. క్రికెట్ రిటర్న్ ప్రకటించకుండానే ప్రస్తుతం తృణముల్  కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్రీడాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు.


 అయితే ఇటీవలే మనోజ్ తివారి  చేసిన స్వీట్  సంచలనంగా మారిపోయింది. మంత్రి హోదాలో ఉన్న తాను క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ఒక ట్వీట్ చేసాడు. అంటే మీ వల్ల కాకపోతే చెప్పండి నేను బరిలోకి దిగుతా అన్నట్లుగా ట్విట్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: