అలాంటి షాట్లు ఆడితే పిచ్చోడిలా చూసేవారు : రవి శాస్త్రి

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. సీనియర్ ఆటగాళ్లకు సరి కొత్త అనుభవాన్ని తీసుకువచ్చి పెడితే ఆట జూనియర్ ఆటగాళ్లకు మాత్రం ఏకంగా తమ ప్రతిభను చాటుకునేందుకు మంచి వేదికగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రాణించి అంతర్జాతీయ జట్టులో అవకాశం దక్కించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ప్రతీ ఐపీఎల్ లో కూడా కొత్త యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు తెరమీదికి వస్తూనే ఉంటారు.



 ఇక ఇలా తెర మీదికి వచ్చిన ఆటగాళ్లకు మాజీ ఆటగాళ్లు పలు సూచనలు సలహాలు ఇవ్వడమె కాదు వారి ఆటను విశ్లేషిస్తూ ప్రశంసలు కురిపించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మెగా టోర్నీ కారణంగా గొప్ప నైపుణ్యం అని ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు రవిశాస్త్రి. ఇలా తెర మీదికి వచ్చిన కుర్రాళ్ళు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటుతున్నారు అని ప్రశంసించాడు. వైవిధ్యమైన షాట్లతో అభిమానులను అలరిస్తున్నాడూ అని చెప్పుకొచ్చాడు.


 తన తరం లో ఆటగాళ్లు విభిన్నమైన షాట్లు ఆడితే కోసం పిచ్చోడిలా చూసేవారు అంటూ రవి శాస్త్రి తెలిపాడూ. అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. ఆటగాళ్లు ప్రస్తుత పరిస్థితులకు ఎంతో త్వరగా అలవాటు పడిపోతున్నారు. అవకాశం వస్తే ఏ ఫార్మాట్ లో అయినా సత్తా చాటేందుకు సిద్ధంగానే ఉంటున్నారు. టి20 ఫార్మాట్ కారణంగా ఎంతో మంది యువత చిన్న వయస్సులోనే మంచి ప్రతిభ కనబరుస్తూ వెలుగులోకి వస్తున్నారు. ఒక మూడు ఫార్మాట్లలో మెరుగ్గా రాణించడమె 1కాదు వైవిధ్యమైన నటనతో అలరిస్తున్నారు. మా తరం ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. స్విప్, రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లు ఆడితే కోచ్ లు పిచ్చోడిలా చూసేవారు. కానీ ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు అంటూ రవిశాస్త్రి తెలిపాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: