రోహిత్.. ఇంకా 50 పరుగులే?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో రోహిత్ శర్మ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్లో ఒక సాదా సీదా క్రికెటర్ గా ఎంట్రీ ఇచ్చి అత్యుత్తమ క్రికెటర్ గా మారిపోయాడు. ఇప్పుడు మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్సీ చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. అయితే స్టార్ ఓపెనర్ తన బ్యాటింగ్తో ప్రత్యర్థులపై విరుచుకు పడటమె కాదు అటు కెప్టెన్సీలో కూడా తనదైన వ్యూహలతో  జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు..


 ఇప్పుడు వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఏకంగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిపిన ఘనత కేవలం రోహిత్ శర్మ కు మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. ఈ ఏడాది కూడా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్. కానీ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలోనే అటు రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తూ ఉంది. టి-20 ఫార్మెట్లోనూ రోహిత్ శర్మ మరికొన్ని పరుగులు చేస్తే పది వేల పరుగుల మైలురాయిని అందుకోబోతున్నాడూ అని చెప్పాలి.


 కేవలం ఇంకా 50 పరుగులు చేస్తే అటు అంతర్జాతీయ దేశీయ లీగ్ లలో కలుపుకుని 10 వేల పరుగుల మైలురాయిని అందుకో పోతున్నాడూ హిట్ మాన్ రోహిత్ శర్మ. ఇప్పటివరకు ఏకంగా 371 మ్యాచులలో 9950 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇటీవలే కోల్కత్త తో జరిగిన మ్యాచ్ లోనే రికార్డులు సాధిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ  ఊహించని విధంగా కేవలం నాలుగు పరుగులకే ఔటయ్యాడు రోహిత్ శర్మ. దీంతో ఆ తర్వాత మ్యాచ్లోనైనా ఈ అరుదైన ఘనత సాధించాలని కోరుకుంటున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: