మూడు మ్యాచ్ లు.. ఓకే విలన్.. రోహిత్ కు షాక్?
అతను ఎవరో కాదు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ అనేది తెలుస్తుంది. చెత్త బౌలింగ్ తో కోల్‌కతా జట్టు చేతిలో ఓటమికి ప్రధాన కారణం గా మారిపోయింది. ప్యాట్ కమిన్స్ దాటికి డేనియల్ సామ్స్ ఒకే ఓవర్లో 35 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక పదిహేనేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడవ బౌలర్ గా నిలిచాడు. ఇక తొలి ఓవర్సీస్ బౌలర్ గా కూడా ప్రతిష్టను మూటగట్టుకున్నాడు డేనియల్ సామ్స్. ఇక ఈజ్ ద రికార్డులో 37 పరుగులతో భారత బౌలర్లు పి పరమేశ్వరన్ హర్షల్ పటేల్ టాప్ 2 లో ఉండడం గమనార్హం.
కోల్కత్తా విజయానికి చివరి ఐదు ఓవర్లలో 35 పరుగులు కావాల్సి ఉన్న సమయంలో కనీసం మూడు ఓవర్లు మ్యాచ్ జరుగుతుంది అని అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన పాట కమింగ్ టెర్రిఫిక్ బ్యాటింగ్‌తో అటు ముంబై ఆటగాళ్లందరూ అందరిని కూడా భయపెట్టేసాడు. ఒకే ఓవర్ లో కథ మొత్తం ముగించేశాడు. డానియల్ సాంగ్స్ బౌలింగ్‌లో 2 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టి ఇక 16 వ ఓవర్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబై ఇండియన్స్ గెలవాల్సి ఉండగా చాహల్ బౌలింగ్ లో అనవసరమైన షాట్ కి ప్రయత్నించి డకౌట్ గా వెనుతిరిగాడు డేనియల్ సామ్స్. జట్టును కష్టాల్లోకి నెట్టి ఓటమిలో కారణమయ్యాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో కూడా ముంబైకే విజయావకాశాలు ఎక్కువగా ఉండగా .. డేనియల్ సామ్స్ ఒకే ఓవర్ లో 24 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా మూడు మ్యాచ్‌లలో కూడా ఓటమికి ఉన్నాడు అతని కారణం అంటూ అభిమానులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.