నా బ్యాటింగ్ తో నేనే ఆశ్చర్యపోయా : పాట్ కమిన్స్
ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కట్టుదిట్టం చేయడంలో ముంబై ఇండియన్స్ బౌలర్లు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక 87 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది కోల్కత నైట్ రైడర్స్ జట్టు. దీంతో ఇక ముంబై విజయం ఖాయం అయిపోయినట్లే అని అందరూ భావించారు. ఇక అలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ విధ్వంసకర రీతిలో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా సిక్సర్లు ఫోర్ల తో విరుచుకుపడి అటు కోల్కత జట్టుకు విజయాన్ని అందించాడు. ఒకే ఓవర్లో ఏకంగా 35 పరుగులు చేసి ఇక జట్టుకు విజయాన్ని అందించాడు పాట్ కమిన్స్.
అయితే కమిన్స్ ఇంత అద్భుతంగా రాణిస్తాడూ అని అస్సలు ఊహించలేదు అంటూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్ కూడా తన బ్యాటింగ్ పై అదేరీతిలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ పై విధ్వంసకర ఇన్నింగ్స్ తో అందరికంటే ఎక్కువగా తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతున్నాడు పాట్ కమిన్స్. ఏదేమైనా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినందుకు ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నేను బ్యాటింగ్ కీ వచ్చినప్పుడు మ్యాచ్ చివరి దశలో ఉంది. ఆ సమయంలో ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు అని నిర్ణయించుకున్న.. అందుకే బంతి ఎలా వచ్చినా సిక్సర్ 4 కొట్టడానికి ప్రయత్నించా అంటూ కమిన్స్ చెప్పుకొచ్చాడు.