ముంబై, చెన్నై.. ఓటములకు కారణాలు ఇవేనా?
ఇటీవలే మెగా వేలం కారణంగా జట్టులోకి కొత్త ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వడం తో ఇక ఈ రెండు జట్లు కూడా సరికొత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించాయ్ అని చెప్పాలి. ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా అటు చెన్నై సూపర్ కింగ్స్ కి మాత్రం ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని సారథ్య బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే ఇలా ఐపీఎల్లో సక్సెస్ ఫుల్ జట్లుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్ లో మూడు మ్యాచ్లు ఆడగా మూడింటిలో కూడా ఓటమి చవి చూడటం గమనార్హం.
అయితే ఇక ఈ రెండూ సక్సెస్ఫుల్ జట్లు ఇలా వరుస ఓటమిలు చవి చూడటానికి కారణం ఏంటి అని వెతికితే కొన్ని విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ లో కీలక ప్లేయర్ గా ఉన్న పాండ్య సోదరులను వదులుకోవడం.. ఇక మరోవైపు జట్టులో కీలక బౌలర్ గా ఉన్నా ఆర్చర్ గాయం కారణంగా దూరం అవడం ఇండియన్ కి పెద్ద మైనస్ గా మారింది. అంతే కాకుండారోహిత్ శర్మ బూమ్రా పొలార్డ్ లాంటి ఆటగాళ్లు ఇంకా ఫామ్ లోకి రాలేదు. ఇక చెన్నై విషయానికి వస్తే ఓపెనర్ రుతురాజ్ కెప్టెన్ జడేజా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఇక కీలక బౌలర్ దీపక్ చాహర్ గాయంతో దూరమయ్యాడు. ఇక రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించిన ధోనీ కెప్టెన్సీలో కలుగజేసుకుంటున్నాడు. దీంతో చెన్నై జట్టుకు ఇద్దరు కెప్టెన్లు అన్న విధంగా మారిపోయింది. ఈ కారణాలతో ఈ రెండు జట్లు వరుస ఓటములు చవిచూస్తున్నాయి అని కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..