ఓ క్రికెటర్ తాగి.. నన్ను చంపబోయాడు : చాహల్
2013 సీజన్ సమయంలో ఒక క్రికెటర్ తాగిన మైకం లో తనను పదిహేనవ అంతస్తు నుంచి వేలాడదీశాడు అంటూ చెప్పుకొచ్చాడు చాహల్. అయితే ఆ క్రికెటర్ ఎవరు అన్నది మాత్రం బయటపెట్టలేదు. ఈ విషయాన్ని నేను ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు.. ఇకపై అందరికీ తెలిసిపోతుంది అంటూ మొదలు పెట్టిన చాహల్.. 2013లో నేను ముంబై తరఫున ఆడుతున్నాను. ఇక బెంగుళూరులో మేము ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత పార్టీ చేసుకున్నాం.. ఈ క్రమంలోనే ఒక క్రికెటర్ తాగిన మైకం లో ఉన్నాడు. నన్ను చాలా సేపు గమనించి తన వద్దకు రమ్మని పిలిచాడు. ఎందుకు పిలిచాడా అని అతని దగ్గరికి వెళ్లాను. దీంతో నన్ను ఎత్తుకుని ఏకంగా 15 వ అంతస్తు నుంచి వేలాడదీశాడు. ఇక అప్పుడు నా చేతులు అతడి మెడని బిగ్గరగా పట్టుకొని ఉన్నాయి. ఏమాత్రం చేతులు సడలిన పడిపోవడమే.
ఇక ఆ సమయంలో పక్కనే ఉన్న ఆటగాళ్లు వెంటనే స్పందించడంతో చివరికి బ్రతికి పోయాను. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసి పోయేది ఇక ఆ సమయంలో కళ్లు తిరిగి ఎంతగానో భయమేసింది. ఇక ఆ ఒక్క సంఘటన తో ఎక్కడికైనా వెళ్లిన సమయంలో ఎలా ఉండాలి అన్న విషయం తెలిసొచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నేను త్రుటిలో చావు నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా ఇక ప్రాణాలతో ఉండేవాడిని కాదు.. ముందు ఇలా మాట్లాడే వాడిని కాదు అంటూ చాహల్ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ క్రికెటర్ ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదిక కోరుతూ ఉండడం గమనార్హం.