క్లీన్ బౌల్డ్.. ఇది నటరాజన్ డ్రీమ్ డెలివరీ?
అది కూడా ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడం గమనార్హం. మొదట చెన్నై సూపర్ కింగ్స్ ను 154 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్ జట్టు.. తర్వాత లక్ష్యఛేదనలో ఎక్కడా తడబాటు లేకుండా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలోనే టార్గెట్ ఛేధించింది. యువ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ 75 పరుగులతో రాణించాడు.రాహుల్ త్రిపాఠి 39 పరుగులు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 32 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక బౌలింగ్ విభాగంలో నటరాజన్ రెండు వికెట్లు వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశారు.
అయితే క్రీజ్లో కుదురుకున్నారనుకున్న చెన్నై ఓపెనర్లు రాబిన్ ఉతప్ప రుతురాజ్ ను పెవిలియన్ చేర్చడంలో నటరాజన్ సుందర్ కీలక పాత్ర వహించారు. మ్యాచ్ మొత్తాన్ని కూడా సన్రైజర్స్ వైపు తిప్పారు. మరీ ముఖ్యంగా స్టార్ బ్యాట్స్మెన్ రుతురాజ్ ను నటరాజన్ క్లీన్ బౌల్డ్ చేయటం అభిమానులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నటరాజన్ వేసిన ఇన్ స్వింగర్ బంతికి అటు నటరాజన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇక ఇది చూసిన అభిమానులు ఇది నటరాజన్ డ్రీమ్ డెలివరీ అంటూ కామెంట్ చేస్తున్నారు..