ఐపీఎల్ : కేఎల్ రాహుల్ చెత్త రికార్డ్?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కె.ఎల్.రాహుల్ ఎంత కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతకొన్ని సీజన్ల నుంచి కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతున్నాడు. అయితే గతంలో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ఇక వేలంలోకి వదిలీ వేయబడ్డాడు. ఈ క్రమంలోనే ఇక లక్నో జట్టు అతని రిటైన్ చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం లక్నో జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు కె.ఎల్.రాహుల్.


 కాగా ఇక ఈ ఐపీఎల్ సీజన్ అటు లక్నో జట్టుకు మొదటిసారి ఎంట్రీ ఇచ్చి మ్యాచ్ లు ఆడుతున్నప్పటికీ ఎక్కడ తడబాటు లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇటీవల ఐపీఎల్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ అరుదైన రికార్డును తమ ఖాతలో చేర్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ మాత్రం ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశ చెందుతున్నారు అన్నది అర్ధమవుతుంది.


 ఓకే ఐపీఎల్లో రెండుసార్లు ఆడిన తొలి బంతికే అవుట్ అయిన మూడో ప్లేయర్గా  రాహుల్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.   రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి బంతికే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ బౌల్డ్ అయ్యి డకౌట్ గా వెనుతిరిగాడు. గతంలో గుజరాతి టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా షమీ బౌలింగ్లో రాహుల్ ఫస్ట్ బాల్ కి వికెట్ కోల్పోయి అభిమానులను నిరాశపరిచాడు. గతంలో జయ సూర్య, ఉన్ముక్త్ చంద్  ఇలా ఐపీఎల్ లో రెండు సార్లు ఆడిన తొలి బంతికే అవుటైన ప్లేయర్ లు గా కొనసాగుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: