టైమ్ ఆగయా.. ఇక సన్రైజర్స్ కి తిరుగు లేదా?

praveen
తెలుగు క్రికెట్ ప్రేక్షకులందరూ ఆనందం లో మునిగి పోతున్నారు. ఇక తమకు తిరుగు లేదు అంటూ  తెగ సంబర పడిపోతూ ఉన్నారు. దీనికి కారణం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ లో బాగా రాణిస్తూ ఉండటమే. మెగా వేలం కారణం గా ఎంతో మంది కొత్త ఆటగాళ్లను జట్టు లోకి తీసుకున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం. దీంతో గత సీజన్లో లాగా కాకుండా ఈసారి సన్రైజర్స్ సరి కొత్తగా ప్రస్థానం మొదలు పెట్ట బోతుంది అని అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస ఓటములు చవి చూసింది. వరుసగా రెండు మ్యాచ్లలో ప్రత్యర్థికి కనీస పోటీని కూడా ఇవ్వలేక పోయింది సన్ రైజర్స్. ఈ క్రమంలోనే ఇక ఈసారి కూడా మళ్లీ నిరాశ తప్పేలా లేదు అని అభిమానులు అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మూడవ మ్యాచ్ నుంచి మాత్రం సన్రైజర్స్ అనూహ్యం గా పుంజుకుంది. బౌలింగ్ విభాగం లో నే కాదు బ్యాటింగ్ విభాగం లో కూడా తిరుగు లేదు అని నిరూపిస్తుంది. ఇటీవలే ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అద్భుతం గా రాణిస్తుంది.


 ఒకవైపు బౌలింగ్ విభాగం మరో వైపు బ్యాటింగ్ విభాగం కూడా పుంజుకుంది అనేది తెలుస్తుంది. ప్రత్యర్థులను తక్కువ పరుగులకు కట్టడి చేయడమే కాదు.. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా అదరగొడుతోంది. ఇక సన్రైజర్స్ జోరు చూస్తూ ఉంటే వరుస విజయాలు సాధించడం ఖాయం అని అంటున్నారు అభిమానులు. ఇక ఇటీవలే నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలకు బ్రేక్ వేసిన సన్రైజర్స్ ఇక రానున్న రోజుల్లో ఎలా రాణించ పోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: