అక్షర్ పటేల్ పేరు వెనుక.. ఇంత పెద్ద స్టోరీ ఉందా?

praveen
టీమ్ ఇండియా లో ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అక్షర్ పటేల్ ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదరగొడుతున్నాడు. కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు అక్షర్ పటేల్. ఈ క్రమంలోనే కోల్కతా జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కోల్కత నైట్ రైడర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే  ఇటీవలే గౌరవ్ కపూర్ హోస్ట్ చేస్తున్న బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్ అనే కార్యక్రమంలో పాల్గొని తన పేరు వెనుక ఎంతో పెద్ద స్టోరీ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఈ క్రికెటర్.


 చిన్నప్పుడు తన పేరు అక్సర్ పటేల్ గా ఉండేదని తెలిపాడు. అయితే కన్ఫ్యూజన్ వల్ల స్కూల్లో అందరూ అక్షర్ అని పిలిచేవారు. ఇక నా పేరు స్పెలింగ్ ఏంటి అన్నది కూడా మిస్టరీగానే మారిపోయింది. చివరికి స్కూల్ సర్టిఫికెట్ లో నా పేరు అక్సర్ నుంచి అక్షర్ పటేల్ గా మారిపోయింది. ఇక బెంగళూరులో 19 వరల్డ్ కప్ కోసం క్యాంపు జరుగుతున్న సమయంలో కాలేజీ చదువుతున్న.. ఇక పాస్పోర్ట్ అవసరం పడిన సమయంలో ఇక ప్రిన్సిపాల్ తో మాట్లాడి సర్టిఫికెట్ తీసుకున్నాను. ఈ అప్పుడు నా పేరు అక్షర్ గా మారిపోయింది అని తెలుసుకున్నాను. ఈ విషయాన్ని మా నాన్న వద్ద ప్రస్తావిస్తే దేవుడు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఉద్దేశంతోనే నీ పేరు మార్చాడు ఏమో అని చెప్పారు. ఇక దేవుడి దయవల్ల ప్రస్తుతం అక్షర్ పటేల్ గా క్రికెట్లో రాణిస్తున్నా.


 అంతేకాదు మరో విషయం కూడా చెప్పాలి మా నాన్నమ్మకు నన్ను ఒక క్రికెటర్ గా చూడాలని బలమైన కోరిక ఉండేది.. గుజరాత్ లో ఉన్నప్పుడు ఒక మ్యాచ్ లో పాల్గొన్నాను. అంతలోనే నానమ్మ చనిపోయింది అనే వార్త వినాల్సి వచ్చింది. ఇక అప్పుడు గట్టిగా హత్తుకొని ఏడ్చిన నాన్న ఒక విషయాన్ని అడిగాడు. ఇప్పటివరకు ఎప్పుడూ ఏమీ అడగలేదు కానీ  నిన్ను క్రికెటర్గా టీవీలో చూడాలన్నది నాన్నమ్మ కోరిక.. నువ్వు గొప్ప క్రికెటర్ కావాలంటే ఇష్టాన్ని పట్టుదలగా మార్చుకుని మంచి ఆటగాడు గా పేరు పెట్టుకొని నాన్నమ్మా కోరిక తీర్చు అంటూ కోరాడు. నాన్నమ్మ కోరుకున్నట్లుగానే నా పేరు టీవీ లో కనిపించింది. నాన్నకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నాను అంటూ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: