అంతా అతని వల్లే జరిగింది : పూరన్

praveen
ఐపీఎల్ 2022 సీజన్ లో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. మొదటి రెండు మ్యాచ్ల్లో ఓడి పోయి నిరాశపరిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఇప్పుడు మాత్రం వరుసగా విజయాలు సాధిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వరుస విజయాలతో తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది సన్రైజర్స్. గుజరాత్ టైటాన్స్ విజయాలకు బ్రేక్ వేసింది. అన్నీ విభాగాల్లో సమిష్టిగా రాణించిన సన్రైజర్స్  గుజరాత్ పై ఆధిపత్యాన్ని సాధించడంలో సక్సెస్ అయింది.  దీంతో ఇక సన్రైజర్స్ అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆనందంలో మునిగిపోయారు.


 గుజరాత్ తో విజయంలో అటు సన్రైజర్స్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర వహించింది అని చెప్పాలి. భువనేశ్వర్ 2,  నటరాజన్ 2, జాన్సన్ 1, ఇమ్రాన్ మాలిక్ 1 వికెట్ల ను తీసుకొని రాణించారు. లక్ష్య ఛేదనలో అభినవ్ శర్మ 42 కేన్ విలియమ్సన్ 57 పరుగులతో శుభారంభాన్ని ఇచ్చారు.. ఇక చివర్లో నికోలస్ పూరన్ 18 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన నికోలస్ పూరన్ ఇక మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ దిగ్గజం  బ్రియాన్ లారా తో మాట్లాడాడు.


 ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ ప్రస్థానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి రెండు మ్యాచ్లలో ఓటమిపాలైన జట్టు తిరిగి గాడిలో పడటానికి బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా  నే ప్రధాన కారణం అంటు తెలిపాడు. ఇక ఆయన ఇచ్చిన సూచనలు సలహాలు కారణంగానే బ్యాటింగ్ విభాగం ఎంతో బాగా రాణించగలిగింది  అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏదేమైనా సన్రైజర్స్ వరుస విషయాలు మాత్రం అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: