మార్చాల్సిన సమయం ఆసన్నమైంది : బూమ్రా

praveen
ఐపీఎల్ లో ఏ జట్టు కు సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టు గా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. ప్రతి సీజన్లో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో టాప్ లో చోటు దక్కించుకుంటూ వచ్చింది. కానీ ఈ సారి మాత్రం పేలవ ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు వరకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో నాలుగు మ్యాచ్లు వాడితే నాలుగు మ్యాచ్లలో  కూడా ఓటమి చవిచూసింది ముంబై ఇండియన్స్. దీంతో ఇక తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే.


 2022 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయాల పై వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ లో ప్రతి ఒక్క జట్టుకు గడ్డు కాలం అనేది సహజం.. ఏదో ఒక సందర్భంలో ఆ దారిలో వెళ్లాల్సిందే. ప్రస్తుతం మేం కూడా అదే స్థితిలో ఉన్నాము. జట్టులోకి కొత్త క్రికెటర్లు వచ్చారు.. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి టైం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అటు పరిస్థితి మార్చాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ జస్ప్రిత్ బూమ్రా చెప్పుకొచ్చాడు. ఒత్తిడి లో ఉంటేనే పాఠాలు నేర్చుకుంటాం అంటూ తెలిపాడు.


 వరుస ఓటములు జట్టును కుంగతీసినప్పటికీ  ఇక ఈ ఓటముల ద్వారా వచ్చిన అనుభవాలు పాఠాలు రూపంలో నేర్చుకుంటున్నాను అంటూ తెలిపాడు. ఇక రాబోయే మ్యాచ్ నుండి మా గేమ్ ప్లాన్ మారబోతుంది. అయితే ఇలాంటి పరిస్థితులు మా జట్టుకు గతంలో కూడా ఎదురయ్యాయి. ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు చాంపియన్ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి.. కచ్చితంగా నిలదొక్కుకుంటాము అంటూ బూమ్రా ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అయితే తర్వాత మ్యాచ్ లో నైనా ముంబై ఇండియన్స్ విజయాలు సాధించి పుంజుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: