ధోని అంత మాట అనడంతో ఏడుపొచ్చేసింది : అక్షర్ పటేల్

praveen
టీమిండియాలో సీనియర్ ఆల్రౌండర్గా కొనసాగుతూ ఉన్నాడూ అక్షర్ పటేల్. కేవలం బౌలింగ్ లో మాత్రమే కాదు బ్యాటింగ్ లో కూడా తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు.  ఎప్పుడు జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. అయితే అక్షర్ పటేల్ ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే  బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ పేరిట గౌరవ్‌ కపూర్‌ హోస్ట్‌ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆల్రౌండర్ అక్షర్ పటేల్. ఈ క్రమంలోనే తన కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు.


 అంతేకాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తో తనకి ఎలాంటి అనుభవాలు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు అక్షర్ పటేల్. ధోని టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో ఒక మాట అన్నాడు. ఇక ధోని అలా అనడం తో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది కానీ అంతలోనే  పరిస్థితిని అర్థం చేసుకున్న ధోనీ దగ్గరికి తీసుకొని ఊరికే అలా అన్నాను అంటూ చెప్పాడు అంటూ అక్షర్ పటేల్ గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే 2014 -15 లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లిన సమయంలో కెప్టెన్ గా ఉన్నాడు మహేంద్రసింగ్ ధోని.


 బాక్సింగ్ డే టెస్టు ముగిసిన వెంటనే అప్పుడు హెడ్ కోచ్ గా ఉన్న రావిశాస్త్రి డ్రెస్సింగ్ రూంలోకి వచ్చి అత్యవసర సమావేశం అంటూ అందరినీ పిలిచాడు. తర్వాత ధోనీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటూ చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అందరి ముఖాల్లో విచారం ఉంది. సురేష్ రైనా ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. అంతలోనే ధోని డ్రెస్సింగ్ రూంలోకి వచ్చాడు. ధోని భయ్యా అంటూ నేను మాట్లాడడానికి వెళ్ళిన సమయంలో నువ్వు జట్టులోకి వచ్చావు నన్ను బయటికి పంపిస్తున్నావ్ అంటూ ధోని అన్నాడు. ఇక ధోని అలా అనడం తో ఒక్కసారిగా కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి. ఏడవాలి అని అనిపించింది. కానీ అంతలోనే దగ్గరికి తీసుకుని ఊరికే అన్నాను అని చెప్పాడు. ఆ మాట నన్ను ఎంతగానో బాధించింది అంటూ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: