ఆ రెండు మ్యాచ్ ఫలితాలు మార్చాలని ఉంది : రవి శాస్త్రి
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రవిశాస్త్రి ఇటీవలే ఒక విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశం వస్తే భారత్ ఆడిన రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ ల ఫలితాలను మార్చాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ రెండు మ్యాచ్ లలో ఒకటి ఆటగాడిగా మరొకటి కోచ్గా ఉన్నప్పటి మ్యాచ్లు అంటూ గుర్తుచేసుకున్నాడు రవి శాస్త్రి. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా ఆడుతున్న సమయంలో టీమిండియాకు కోచ్ గా రవిశాస్త్రి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు.
అంతేకాదు ఇక 2019లో ఐసీసీ ప్రపంచకప్ సెమీస్ వరకు కూడా చేరుకుంది. ఇక వాతావరణం సహకరించకపోవడంతో రెండు రోజుల పాటు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే ఓకే రోజు మ్యాచ్ జరిగి ఉంటే భారత్ విజయం సాధించేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక 1987 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో టీమ్ ఇండియా గెలిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019 ప్రపంచ కప్ లో సెమీ ఫైనల్ మ్యాచ్లో భాగంగా వర్షం రాకుండా ఉండి ఉంటే భారత జట్టు విజయం సాధించేది అంటు రావిశాస్త్రి చెప్పుకొచ్చాడు. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురించి చెబుతూ 1987లో వరల్డ్ కప్ లో భారత్ చేతిలో ఓటమి పాలయింది. 1983 ప్రపంచ కప్ లో బరిలోకి దిగిన భారత జట్టు కంటే 1987లో ఇంకా పటిష్టంగా ఉంది అంటు శాస్త్రి చెప్పుకొచ్చాడు..