వారెవ్వా.. పుజారా డబుల్ సెంచరీ?
ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే కౌంటీ లో భాగంగా మంచి టచ్ లో కనిపించాడు చటేశ్వర్ పుజారా. కేవలం సెంచరీ చేసి అదరగొట్టడం కాదు ఏకంగా డబుల్ సెంచరీతో ఔరా అనిపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి నిరాశపరిచిన చటేశ్వర్ పుజారా అటు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం డబుల్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఇక కౌంటీ క్రికెట్ లో భాగంగా అరంగేట్రం మ్యాచ్‌లోనే పుజారా డబుల్ సెంచరీ చేయడంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి. కౌంటి క్రికెట్ లో భాగంగా ససెక్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నాడు పూజారా.
కాగా ఇటీవలే డెర్బీ షేర్ తో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 201 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు చెటేశ్వర్ పుజారా. అయితే చటేశ్వర్ పుజారా తో పాటు కెప్టెన్ టామ్ హైన్స్ కూడా 243 పరుగులతో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టడంతో చివరికి ససెక్స్ టీం ఓటమి నుంచి గట్టెక్కి ఇక మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఇక మరికొన్ని మ్యాచ్‌ల్లో చటేశ్వర్ పుజారా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే మళ్లీ టీమిండియా లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం అభిమానులు అనుకుంటున్నారు.