హార్దిక్ పాండ్యా.. అతన్ని పక్కన పెట్టు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇక ఈ సారి కూడా ఎప్పటిలాగానే యువ ప్రతిభ సత్తా చాటుతోంది. ఎంతో మంది యువ ఆటగాళ్లు ప్రతి మ్యాచ్లో కూడా అదరగొడుతు తామే ఫ్యూచర్  స్టార్స్  అని చెప్పకనే చెబుతున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో సీనియర్లు గా కొనసాగుతున్న వారు పేలవమైన ప్రదర్శన కారణంగా విమర్శలను ఎదుర్కోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.


 ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్ జట్టు ఒక్క మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్ లలో కూడా విజయం సాధించింది అని చెప్పాలి. అటు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐదు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఉత్కంఠగా మారిపోయింది. అయితే చివరికి గుజరాత్ టైటాన్స్ జట్టు మరోసారి విజయాన్ని సాధించి సత్తా చాటింది. హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోయినప్పటికీ రషీద్ ఖాన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు విజయఢంకా మోగించింది.


 గుజరాత్ జట్టు విజయం సాధించినప్పటికీ అటు అదే జట్టు బౌలర్ ఫెర్గ్యూసన్ మాత్రం ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 46 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదండోయ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇంతకుముందు 2020 ఐపీఎల్ సీజన్ లో నాలుగు ఓవర్లలో 54 పరుగులు, 2021 ఐపీఎల్ సీజన్ లో నాలుగు ఓవర్లు 56 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా చెత్త బౌలింగ్ వేసాడు. అంతకుముందు సన్రైజర్స్ లో జరిగిన మ్యాచ్ లో కూడా 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయలేదు   దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్  అతని పక్కన పెడితే బెటర్ అని అభిమానులు సలహా ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: