టాటూ లపై సమంత షాకింగ్ కామెంట్స్.. ఏమందో తెలుసా?
ఈ క్రమంలోనే ఇటీవల తన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి అభిమానులతో చిట్ చాట్ చేసింది అభిమానులు. అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చింది ఈ సొగసరి. ఈ క్రమంలోనే మీరు మీ జీవితంలో థియేటర్ లో చూసిన మొదటి సినిమా ఏది అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా.. జురాసిక్ పార్క్ అంటూ సమాధానం చెప్పింది సమంత. ఇక మొదటి సంపాదన ప్రస్తావనను ఒక అభిమాని తీసుకురాగా.. ఒక హోటల్లో హోస్టెస్ గా ఎనిమిది గంటలపాటు పని చేసి మొదటిసారి 500 రూపాయలు సంపాదించాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని మీ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయండి అంటూ ఒక మెసేజ్ కూడా అభిమానులకు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఎప్పటికైనా వేసుకోవాలి అని మీరు అనుకుంటున్న టాటూ ఏంటి అని ఒక అభిమాని ప్రశ్నించగా తాను అసలు ఎలాంటి టాటూలు వేయించుకోవద్దని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను టాటూ వేయించుకుంటాను అనే ఆలోచన మీకు ఎవరికైనా ఉంటే అలాంటివి మానుకోవాలని అంటు సలహా ఇచ్చింది. ఇక సమంత టాటూల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయ్. అయితే గతంలో మాజీ భర్త పై ప్రేమతో 3 టాటూలు వేయించుకుంది సమంత.