ఐపీఎల్ 15 జోరు... కొత్త విజేతనే చూడబోతున్నాం ?
ప్రస్తుతం ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు అయితే కేవలము ఎనిమిది జట్లు మాత్రమే బరిలో ఉండేవి. వాటిలో నాలుగు జట్లు ప్లే ఆప్స్ కు చేరడం కొంచెం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు టోర్నీలో మొత్తం పది జట్లు ఉండడంతో ప్లే ఆప్స్ రేస్ చాలా కఠినంగా మారే అవకాశం ఉంది. ఒక్కొక్క జట్టు 14 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లలో అత్యధికంగా గెలిచి మొదటి నాలుగు స్థానాలు సాధించిన జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చెన్నై మరియు ముంబై లకు ప్లే ఆఫ్ ఇక కష్టమే. ఎందుకంటే ముంబై తాను ఆడిన ఆరు మ్యాచ్ లలోనూ ఓటమి పాలై దాదాపు ప్లే ఆఫ్ రేస్ నుండి అనధికారికంగా నిష్క్రమించింది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా దాదాపు ఇదే పొజిషన్ లో ఉంది. తాను ఆడిన 6 మ్యాచ్ లలో 1 మాత్రమే గెలిచి దాదాపు అదే పరిస్థితిలో ఉంది. ఇక కోల్కతా జట్టు అయితే 6 ఆడి 3 గెలిచింది. అయితే కీలక ప్లేయర్స్ వరుసగా విఫలం కావడం కోల్కతా ఓటములు కారణం. ఇక ఈ సారి ఐపిఎల్ ట్రోఫీ గెలుస్తాయి అని అనుకుంటున్న జట్లలో మొదటి స్థానంలో లక్నో, బెంగళూర్, రాజస్థాన్ మరియు గుజరాత్ లు ఉన్నాయి. అయితే సంచలనాలకు మారు పేరైన ముంబై చెన్నై లు కూడా ఏదైనా అద్బుతం జరిగి టైటిల్ కోసం పోటీకి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. మరి చూద్దాం ఏ జట్టు ఈ సారి ఐపిఎల్ ట్రోపీ ని ముద్దాడుతుందో?