ధోనీ జట్టుకు మరో ఎదురుదెబ్బ.. స్టార్ బౌలర్ ఔట్?
ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి దూరం అవుతూ ఉండడం తో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అనే చెప్పాలి. ఇప్పటికే 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు దీంతో ఇక చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆల్‌రౌండర్ లేకుండా పోయాడు అదే చెప్పాలి. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది అని తెలుస్తోంది. న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే కూడా దీపక్ చాహర్ బాటలోనే గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు అనేది తెలుస్తుంది.
ఇటీవలే మోకాలి గాయం బారినపడిన ఆడమ్ మిల్నే సీజన్ మొత్తానికి దూరం కాబోతున్నాడట. మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పేసర్ రెండో మ్యాచ్‌లో ప్రాక్టీస్ సెషన్లో గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ఇక మిల్నెకు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఇక ఇటీవల మరోసారి పరీక్షించిన వైద్యులు ఇక అతను కోలుకోవడానికి మరికొన్ని వారాల సమయం పట్టవచ్చని చెప్పారట. ఇప్పటికే ఓటమి లతో సతమతమవుతున్న సి ఎస్ కే కు ఇక ఇప్పుడు మిల్నే కూడా దూరమవడంతో ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి..