సెంచరీ మిస్.. అయితేనేం అభిమానులు ఖుష్?
ఇటీవలే ఇక ఐపీఎల్ సీజన్ లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ డూప్లెసిస్ 64 బంతుల్లో 96 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది బెంగళూరు జట్టు.
అయితే మొదట బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ ఎంతో పేలవంగానే ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత మాత్రం కెప్టెన్ డూప్లేసెస్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇక ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు. జట్టు భారీ స్కోర్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 96 పరుగుల వద్ద అటు డూ ప్లేసెస్ సెంచరీ చేయడం ఖాయం అని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో క్యాచ్ అవుట్ అయి వెనుదిరిగాడు డూ ప్లేసిస్. దీంతో సెంచరీ మిస్ అయింది అని అభిమానులు అందరూ కూడా నిరాశ చెందారు. అయినప్పటికీ జట్టు విజయం సాధించడంపై ఆనందంలో మునిగిపోయారు అభిమానులు.