అతని బ్యాటింగ్ చూశాక.. మళ్ళీ క్రికెట్ ఆడాలని ఉంది : ఎబి డివిలియర్స్
తన అనుభవాన్ని అంతా రంగరించి ఇక ఫినిషింగ్ టచ్ ఇస్తూ భారీగా పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో సక్సెస్ అవుతున్నాడు దినేష్ కార్తీక్. సీనియర్ క్రికెటర్ అని ముద్ర పడిపోయిన దినేష్ కార్తీక్ ఇంకా తన ఆటలో కసి మాత్రం తగ్గలేదు అని నిరూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రస్తుతం ఐపీఎల్ లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే దినేష్ కార్తీక్ ప్రదర్శనపై బెంగుళూరు మాజీ ఆటగాడు ఏపీ డివిలియర్స్ స్పందించాడు. దినేష్ కార్తీక్ ఆటను చూస్తూ ఉంటే నాకు మళ్ళీ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాలి అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇటీవలే బెంగుళూరు లక్నో మధ్య జరిగిన మ్యాచ్ కు ముందు వీయు స్పోర్ట్స్ స్ట్రీమింగ్ తో ఎబి డివిలియర్స్ మాట్లాడుతూ ఐపీఎల్ లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చూసి షాక్ అయ్యాను. గత కొన్ని నెలలుగా అతను క్రికెట్ ఎక్స్పోజర్ అనుకున్నాను. ఐపీఎల్ ముందు అతను ఇంగ్లాండులో వ్యాఖ్యాతగా కనిపించాడు. దీంతో అతన్ని చూస్తే ఇక కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించే స్టేజ్ లో ఉన్నాడని భావించా.. కానీ గతంలో కంటే దినేష్ కార్తీక్ ఈ సీజన్లో సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. అతను సమర్థుడైన ఆటగాడని ఎప్పటి నుంచో తెలుసు.. అధిక ఒత్తిడిని అదుపు చేయగల సత్తా కూడా అతని సొంతం. జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం తోనే అతను దేశవాళీ క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అతని ఆటతీరు ఆశ్చర్యం వేసింది. కార్తీక్ 360 డిగ్రీ ప్లేయర్ అంటూ డివిలియర్స్ కొనియాడాడు..