ఐపీఎల్ : థర్డ్ అంపైర్ కు కళ్ళు కనిపించలేదా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఎన్నో జట్లకు అటు అంపైర్లు చేస్తున్న పొరపాటు శాపంగా మారి పోతూనే ఉంది. కొన్ని కొన్ని సార్లు థర్డ్ అంపైర్లు ఇస్తున్న తప్పుడు నిర్ణయాలు కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్లు తప్పులు చేస్తూ ఉంటే అటు అన్ని సరిదిద్దాల్సిన థర్డ్ అంపైర్లు అంతకుమించిన చెత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో అభిమానుల  ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ క్యాచ్ విషయంలో తప్పుడు నిర్ణయం అందరినీ కంగుతినేల చేసింది అనే విషయం తెలిసిందే.

 దీంతో సోషల్ మీడియా వేదికగా థర్డ్ అంపైర్ తప్పిదంపై అటు సన్రైజర్స్ అభిమానులు చీవాట్లు పెట్టారు. అయినప్పటికీ థర్డ్ అంపైర్ తీరులో మాత్రం మార్పు రాలేదు అన్నది తెలుస్తుంది. లక్నో బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. చమీరా వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతిని కోహ్లీ భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేవగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న లక్నో కెప్టెన్  కె.ఎల్.రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి నేలకు తాకుతుందనే సమయంలో కేఎల్ రాహుల్ క్యాచ్  అందుకున్నాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ క్యాచ్ విషయంలో మరింత స్పష్టత కోసం థర్డ్ అంపైర్ కు నివేదించారు. అయితే రిప్లై లో చూసుకుంటే కె.ఎల్.రాహుల్ బంతిని అందుకోవడం కంటే ముందే నేలకు తాగినట్లు క్లియర్ గా కనిపించింది. కానీ అటు తర్వాత మాత్రం థర్డ్ అంపైర్  అవుట్ గా ప్రకటించారు. దీంతో కోహ్లీ గోల్డెన్ డకౌట్ పెవీలియన్ కు చేరాల్సిన పరిస్థితి వచ్చింది.

 దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారి పోవడం తో ఇది చూసిన బెంగళూరు జట్టు అభిమానులందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం బెంగళూరు అభిమానులే కాదు ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా థర్డ్ అంపైర్ తప్పిదాలు ప్రస్తుతం ఐపీఎల్లో జట్ల పాలిట శాపంగా మారిపోతున్నాయి అంటూ తిట్టి పోస్తూ ఉండడం గమనార్హం. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: