చెన్నై, ముంబై వైఫల్యానికి కారణం అదే : జడేజా

praveen
ముంబై ఇండియన్స్,  చెన్నై సూపర్ కింగ్స్.. ఈ రెండు జట్ల గురించి చెప్పగానే  ముందుగా ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు సృష్టించిన రికార్డులే ప్రేక్షకులకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్లుగా కూడా కొనసాగుతున్నాయి ఈ రెండు జట్లు. కానీ ఈ సారి మాత్రం పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. సాదా సీదా జట్లపై సైతం విజయం సాధించడానికి ఎంతో తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఛాంపియన్ జట్లకు.

 ఏ జట్టుతో మ్యాచ్ జరిగినా అసలు కలిసి రావడం లేదు అని చెప్పాలి. రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క మ్యాచ్ అయినా గెలిచింది. రోహిత్ నేతృత్వంలోని  ముంబై ఇండియన్స్ మాత్రం ఇప్పటివరకు ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేక పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఛాంపియన్ జట్లు అటు పాయింట్ల పట్టికలో తొమ్మిది పది స్థానాలలో కొనసాగుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ అజయ్ జడేజా ఈ ఛాంపియన్ జట్ల వైఫల్యం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై చెన్నై వైఫల్యాలకు గల కారణాలు ఏంటి అన్న విషయాలను చెప్పుకొచ్చాడు.

 ఇటీవలే క్రీక్ బజ్ తో మాట్లాడిన అజయ్ జడేజా ముంబై చెన్నై కి టాప్ ఆర్డర్ బౌలర్లు ఎవరూ లేరు అందుకే పాయింట్ల పట్టికలో ఆ జట్లు అడుగు ఉన్నాయి. చెన్నై జట్టులో పెద్దగా మార్పులు చేయడం లేదు. బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఏదో కీలక సమయంలో మాత్రం మలుపు తిప్పగల ఫాస్ట్ బౌలర్ చెన్నై సూపర్ కింగ్ కి అవసరం ఉంది. రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు రాణించడం శివమ్ దూబే మంచి ఫామ్ లో ఉండటం చెన్నై కి కలిసొచ్చే అంశాలు అంటూ చెప్పుకొచ్చాడు. పేసర్లు లేక పోవడమే పెద్ద సమస్యగా మారిపోయిందనీ.. ముంబై ఇండియన్స్ కి జస్ప్రిత్ బూమ్రా టైమల్ వంటి ఇద్దరు ఫేసర్లు ఉన్నారు.  చెన్నైకి దీపక్ చాహర్ దూరం కావడంతో మిగతా బౌలర్లు ఉన్న పెద్దగా రాణించడం లేదు అంటూ అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: