ధోని.. మాకోసం వెనక్కి రా ప్లీజ్?
దీంతో ధోని ఆట చూడాలనుకున్న అభిమానులందరికీ కూడా అటు ఐపీఎల్ ఒక్కటే మార్గంగా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఐపీఎల్ లో కూడా పేలవా ప్రదర్శనతో నిరాశపరిచాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రమే అద్భుతమైన ఫినిషింగ్ టచ్ చేస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇటీవలే ముంబై తో జరిగిన మ్యాచ్ లో చివర్లో ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లు తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చి గెలిపించాడు. మహేంద్రసింగ్ ధోని వయసు పెరిగినా బ్యాటింగ్లో పదును తగ్గలేదని తోని మరోసారి నిరూపించాడు. అంతేకాదు ఇక ఈ టోర్నీ తొలి మ్యాచ్లోనే అర్థ శతకం సాధించాడు.
దీంతో ఇక ఇలా ధోని ఫినిషింగ్ చూసిన తర్వాత ధోనిలో ఇంకా కసి తగ్గలేదని మళ్లీ టీమిండియా జట్టులో చూడాలని అనుకుంటున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ధోని కి ఒక ఆశక్తికర విజ్ఞప్తి చేశాడు. రానున్న టి20 ప్రపంచకప్ కోసం ధోనీ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని ఇదేవిధంగా మనమంతా అతనికి విజ్ఞప్తి చేద్దామంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. దీంతో ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు అందరూ కూడా ధోని మాకోసం మళ్ళి వెనక్కి రా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం..