జోస్ బట్లర్ రికార్డ్.. కోహ్లీ తర్వాత ఒకే ఒక్కడు?
ఎందుకంటే ప్రత్యర్థి జట్టు ఎవరైనా బౌలింగ్ వేసేది ఎంత స్టార్ అయినా సరే జోస్ బట్లర్ మాత్రం ప్రతీ బంతిని బౌండరీకి తరలించడమె లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సెంచరీలతో రెచ్చిపోతున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి 68 బంతుల్లో 116 పరుగులు చేసి మరోసారి సెంచరీతో విరుచుకుపడ్డాడు జోస్ బట్లర్. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లోనే అతి పెద్ద స్కోరు 222 చేసింది. తర్వాత ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చతికిల బడటంతో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్.
ఇకపోతే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసి అదరగొట్టిన జోస్ బట్లర్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల ఢిల్లీ పై చేసిన సెంచరీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో బట్లర్ కు మూడవ సెంచరీ కావడం గమనార్హం. దీంతో ఒక్క ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ తర్వాత రెండు కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా 2016 ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో కొనసాగిన ఆర్సిబి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 4 సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటికి ఈ రికార్డు అలాగే పదిలంగా ఉంది. జోస్ బట్లర్ జోరు చూస్తే ఈ రికార్డు బ్రేక్ అయ్యేలాగే కనిపిస్తోంది..