పంత్ కెప్టెన్సీ ఏమైనా బాగుందా మీరే చెప్పండి ?

VAMSI
ఐపిఎల్ సీజన్ 15 లో మ్యాచ్ లు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. మ్యాచ్ లు గడుస్తున్న కొద్దీ జట్ల మధ్య ప్లే ఆప్స్ పోటీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ మరియు లక్నో జట్లు ఎలాగైనా తొలిసారి తమదైన ముద్ర వేయాలని తహతహలాడుతున్నారు. ఇదిలా ఉంటే గత రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొత్తం 429 పరుగులు నమోదు కావడం గమనార్హం. ఇరు జట్లు చివరి వరకు పోటా పోటీగా పోరాడినా విజయం మాత్రం రాజస్థాన్ ను వరించింది. ఈ మ్యాచ్ లో విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో గుజరాత్ ను కిందకు నెట్టి మొదటి స్థానానికి చేరుకుంది.

అయితే మ్యాచ్ అన్నాక గెలుపు ఓటమి సహజమే. కానీ మన వైపు నుండి 100 శాతం ప్రయత్నం లేకపోతే మాత్రం ఉపయోగం లేదు.  కానీ ఈ ఓటమికి సగభాగం బాధ్యత మాత్రం ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ది ఉందని చెప్పాలి. ఢిల్లీ లో అనుభవజ్ఞులైన బౌలర్ లు ఉన్నారు. కానీ వాటిని సరిగా ఉపయోగించుకోవడంలో పంత్ అనుభవలేమి కనిపిస్తోంది. ఒకవైపు బట్లర్ బౌలర్లను ఊచకోత కోస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు. అయితే బౌలర్లను రొటేట్ చేయడంలో రిషబ్ కన్ఫ్యూజ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అప్పటికే అందరు బౌలర్లు పదికిపైగా పరుగులు సమర్పించుకుని తేలిపోతే, ఒక్క శార్దూల్ థాకూర్ మాత్రం కాస్త పరవాలేదు అనిపించాడు. కానీ అతనికి ఫుల్  ఓవర్ లు ఇవ్వలేదు.

ఇక బ్యాటింగ్ లో 223 లక్ష్య చేధనతో బరిలోకి దిగిన పంత్ సేన మొదటి నుండి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే పంత్ వచ్చినప్పటి నుండి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కానీ ఇక్కడ చివరి వరకు ఉండి టీమ్ కు విజయాన్ని అందించాల్సింది పోయి ఒక ప్లేయర్ లాగా బౌండరీలు బాధేసి అవుట్ అవ్వడం చాలా బాధాకరం. ఒక ఓవర్ లో అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు మళ్ళీ భారీ షాట్ ఆడడం అవసరమా ? కానీ అనవసర షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఇలా కెప్టెన్ గా బాధ్యతను మరిచి ఆడి టీమ్ ను ఓటమి పాలు చేశాడు. దీనితో పంత్ కెప్టెన్సీ పై విమర్శలు జోరందుకున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: