రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయాలి ఉంది : బట్లర్
ఈ క్రమంలోనే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ తర్వాత ఐపీఎల్ లో రెండు కు పైగా సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా జోస్ బట్లర్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఒకవేళ ఇదే ఊపును కొనసాగిస్తూ మరో సెంచరీ చేశాడు అంటే విరాట్ కోహ్లీ రికార్డు కూడా బ్రేక్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఇక ఇటీవల ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో కూడా విధ్వంసం సృష్టించి సెంచరీతో చెలరేగిన జోస్ బట్లర్ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నీకు ఓపెనింగ్ భాగస్వామిగా ఎవరితో ఆడాలని ఉంది అంటూ అడుగగా తన మనసులో మాట బయటపెట్టేసాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తాను ఓపెనింగ్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
పాతతరం క్రికెటర్లలో వెస్టిండీస్ కెప్టెన్ వివ్ రీఛర్డ్స్ పేరు చెప్పుకొచ్చాడు జోష్ బట్లర్. దిగ్గజ క్రికెటర్ టి20 క్రికెట్ ఆడితే చూడాలని ఉంది అంటూ తెలిపాడు. 2018లో ముంబై తో ఆడిన ఇన్నింగ్స్ టీ20 లీగ్ లో తన ఫేవరేట్ అంటూ జోస్ బట్లర్ తెలిపాడు. ఇక ఎవరి బౌలింగ్‌లో ఎక్కువగా ఇబ్బంది పడతారు అని అడిగిన ప్రశ్నకు.. రషీద్ ఖాన్ పేరు చెప్పాడు. అతని బౌలింగ్‌లో ఆడటం కాస్త కష్టం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు జోస్ బట్లర్.