ధర రూ.10 కోట్లకు పైగానే.. కానీ ప్రదర్శన?
ఇషాన్ కిషన్ : ముంబై ఇండియన్స్ జట్టు అతనిపై ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది. 15.25 కోట్లతో కొనుగోలు చేశారు. అయితే గత కొంత కాలంగా ముంబై ఇండియన్స్ జట్టు తరపున రాణిస్తూ ఉన్నాడు. దీంతో భారీ ధర పెట్టేందుకు కూడా సిద్ధమైంది. కానీ ఇప్పుడు మాత్రం ఇషాన్ కిషన్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోతున్నాడు. ఏడు మ్యాచ్ లలో కేవలం 191 పరుగులు మాత్రమే చేశాడు. ఇంతలో మునుపటి మెరుపు ఎక్కడా కనిపించలేదు.15 కోట్లకు న్యాయం చేయలేక పోతున్నాడు ఇషాన్.
హర్షల్ పటేల్ : గత ఏడాది ఆర్సిబి తరుపున ముప్పై రెండు వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన వీరుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతని మీద నమ్మకంతో వేగంగా 10.75 కోట్లకు దక్కించుకుంది బెంగళూరు జట్టు. ఈసారి మాత్రం అతని బౌలింగ్లో పస లేదు. ఎక్కువ వికెట్లు తీయలేక పోతున్నాడు.
శార్దూల్ ఠాకూర్ : ముందు వరకు చెన్నై విజయాల్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో కీలకపాత్ర వహించిన శార్దూల్ ఠాకూర్.. ఈసారి మాత్రం ఢిల్లీ కి వెళ్ళాడు. కానీ ఢిల్లీ జట్టు లో మెరుపులు మెరిపించ లేకపోతున్నాడు. 10.75 కోట్లకి తగ్గించుకుంది ఢిల్లీ. కానీ ఢిల్లీ జట్టుకు తన ప్రదర్శన ఉపయోగపడటం లేదన్నది తెలుస్తోంది. ఇప్పుడు వరకు మొత్తంగా నాలుగు వికెట్లు తీసి 80 పరుగులు మాత్రమే చేశాడు.
ప్రసిద్ కృష్ణ : కోల్కతా జట్టు లో మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు రాజస్థాన్ జట్టులో కొనసాగుతున్నారు.10 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్తాన్. గత సీజన్లో పర్వాలేదనిపించినా ఈ ప్లేయర్ ఇక ఈ సీజన్లో మాత్రం దక్కించుకున్న ధరకు న్యాయం చేయలేక పోతున్నాడు. కేవలం ఏడు మ్యాచ్ లలో 8 వికెట్లు తీసి 8.14 ఎకానమి తో కొనసాగుతున్నాడు