ఐపీఎల్ హిస్టరీలో.. సన్రైజర్స్ అరుదైన రికార్డు?
మొదటి రెండు మ్యాచ్ లలో ఓడి అభిమానులను నిరాశపరిచిన సన్రైజర్స్ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించింది. విజయం అయితే వస్తుంది కానీ రన్రేట్ మాత్రం మెరుగుపడటం లేదు. ఇలా అయితే కష్టమే అనుకున్నారు అభిమానులు. ఇటీవలే బెంగళూరుపై అద్భుతమైన విజయాన్ని సాధించి అన్ని జట్ల కంటే మెరుగైన రన్రేట్ ఒక్క మ్యాచ్ తోనే సాధించింది సన్ రైజర్స్. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కి దూసుకుపోయింది. తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీ లోనే అరుదైన రికార్డును సాధించింది సన్రైజర్స్ హైదరాబాద్. 72 బంతులు మిగిలి ఉండగానే బెంగుళూరు పై విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ లో అతి ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన నాలుగవ జట్టుగా సన్రైజర్స్ నిలిచింది. ఇక ఈ లిస్టులో ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో ఉంది 2008 ఐపీఎల్ సీజన్ లో కోల్కత పై 87 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఇక కొచ్చి టాస్కర్స్ 76 బంతులు మిగిలి ఉండగానే 2011లో రాజస్థాన్ పై విజయం సాధించింది. ఇక పంజాబ్కింగ్స్ 73 బంతులు మిగిలి ఉండగానే 2017 ఢిల్లీ క్యాపిటల్స్పై విజయ ఢంకా మోగించింది. ఇప్పుడు సన్రైజర్స్ 74 బంతులు మిగిలి ఉండగానే ఆర్సిబి పై ఘన విజయం సాధించింది.